Homeజాతీయంఉత్తర్‌ప్రదేశ్‌లో ‘టీ కప్ప్పు’ ధుమారం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ‘టీ కప్ప్పు’ ధుమారం

- Advertisement -

లఖ్‌నవూ (ఉత్తర్‌ప్రదేశ్): రాష్ట్రంలో టీ కప్ప్పు రాజకీయ ధుమారం రేపింది. ఫతేపూర్ జిల్లాలో ఓ టీ కొట్టులో ఆహార భద్రత అధికారులు తనఖీలు జరిపి కొన్ని నమూనాలు పరీక్షకు తీసుకువెళ్లారు. దీనితో అది రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ‘సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఇటీవల మా ప్రాంతంలో పర్యటించారు. ఆయనకు మా అబ్బాయి అభిమానంగా టీ అందించాడు. అప్పటినుంచీ మాకు అధికారుల వేధింపులు పెరిగాయి’ అని స్థానిక చిరు వ్యాపారి శేషమణి యాదవ్ మీడియాతో చెప్పారు. తనిఖీ అధికారులు…టీ తయారీలో అల్యూమినియం పాత్రలు ఎందుకు వాడుతున్నారని ప్రశ్నిచారని, మా దగ్గర నుంచి తేయాకు నమూనాల వంటివి తీసుకువెళ్లారని చెప్పారు. ‘మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 15న ఆ దుకాణం తనిఖీ చేసి నమూనాలు సేకరించాం. నాణ్యత నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ప్రధాన ఆహార భద్రతాధికారి రాజేశ్ దీక్షిత్ వివరణ ఇచ్చారు. టీ కొట్టు యజమాని కుమారుడైన ఆర్యన్ యాదవ్ ఆదివారం లఖ్‌నవూలో అఖిలేశ్‌ను కలవగా పూర్తి మద్దతు ప్రకటించిన ఆయన కొన్ని ఇత్తడి పాత్రలు బహూకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అఖిలేశ్ లఖ్‌నవూ నగరమంతా అల్యూమినియం పాత్రల్లోనే టీ చేస్తారు. ఈ కారణంగా దుకాణాలు సీజ్ చేస్తారా అని ప్రశ్చించారు. ప్రతి పక్షాల పట్ట అధికార పక్షానికి ఎందుకంత అనుమానమో తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు