Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

అందరూ కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలి : హరీష్‌రావు

కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చినా తట్టుకొనే విధంగా 1400 పడకలు హైద్రాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడిరచారు. నీలోఫర్‌లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో 6 ఆసుపత్రుల్లో 100 పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగా వనస్థలిపురంలో 100 పడకలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. అందరూ కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రభుత్వానికి సహకరించాలన్నారు. 24 లక్షల హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లను అందుబాటులో ఉంచుకున్నామన్నారు. పేదల వైద్యం మీదా ఎక్కువ ఖర్చు పెడుతున్నామని హరీష్‌రావు తెలిపారు. మున్సిపాలిటీలో కూడా బస్తి దవాఖానాను ప్రారంభించనున్నామన్నారు. కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకొని అదనంగా వైద్యలను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందరూ తీసుకోవాలని సూచించారు. టీకా సురక్షితమని కొంచెం వ్యాధి లక్షణాలున్నా పరీక్షలు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img