టీఆర్‌ఎస్ తెలంగాణను ఎంతగానో అభివృద్ధి చేస్తుందని, అయితే గ్రామాల్లో ఎంత అభివృద్ధి చేసిన ఇంకా మిగిలే ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఏడు గంటల కరెంట్ కోసం ధర్నాలు చేసిన పరిస్థితి ఉండేదని ఇప్పుడు 24గంటల కరెంట్ ఇస్తున్నారని చెప్పారు.బీజేపీ నేతలు దిల్లీకి పోయి తెలంగాణను పొగుడుతారు రాష్ట్రానికొచ్చి తిడుతారని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా 13వందల కోట్లు ఒక్క వికారాబాద్ జిల్లాకే ఖర్చు చేశారన్నారు. వికారాబాద్ జిల్లాలోని ప్రతి జెడ్పీటీసీకి 15లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తామని దయాకర్‌రావు పేర్కొన్నారు.