Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

అడవుల రక్షణ, పచ్చదనం పెంపునకు అత్యధిక ప్రాధాన్యత : సీఎం కేసీఆర్‌

తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్ల నుంచి అడవుల రక్షణ, పచ్చదనం పెంపునకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సందేశం ఇచ్చారు. ముందుగా..విధి నిర్వహణలో ప్రాణాలొదిలి అమరులైన వారికి సీఎం హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటించారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ప్రాణాలను సైతం వదిలిన వీరి స్ఫూర్తి మనకు ఆదర్శమని చెప్పారు. అనాది నుంచి మనుషులు, అడవులది విడదీయరాని బంధం. ప్రకృతి, పర్యావరణం తోడుగానే మనిషి ఎదుగుదల సాధ్యమైందన్నారు. ఆ విషయాన్ని గుర్తించే తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్ల నుంచి అడవుల రక్షణ, పచ్చదనం పెంపునకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. హరితహారం ద్వారా జంగల్‌ బచావో`జంగల్‌ బడావో నినాదం తీసుకుని పని చేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img