Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

అత్యంత వేగవంతంగా అభ్యున్నతి చెందుతున్న దేశం మనది

గవర్నర్‌ తమిళి సై
భారతదేశం అత్యంత వేగవంతంగా అభ్యున్నతి చెందుతున్న దేశమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌, పాండిచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డా. తమిళి సై సౌందర రాజన్‌ తెలిపారు. స్వయం శక్తితో ఎదుగుతున్న దేశంగా వెల్లడిరచారు. 20 దేశాలకు ఆధిపత్యం వహిస్తున్న సందర్భంలో భారతీయులమైన మనం అపారమైన గర్వం పొందుతున్నామని అన్నారు. తన కలను సాకారం చేసుకొనే దిశగా పయనించిందన్నారు.జిల్లాలోని డిచ్‌ పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాల యంలో శనివారం జరిగిన ‘‘ఇండియాస్‌’ జి 20 ప్రెసిడెన్సీ ఆపర్చినిటీస్‌ అండ్‌ చాలెంజెస్‌ ఫర్‌ ఇండియా యాస్‌ ది గ్లోబల్‌ లీడర్‌’’ అనే అంశంపై జాతీయ సదస్సుకు గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌, పాండిచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డా. తమిళి సై సౌందర రాజన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img