అత్యాచారం కేసులో సీఐ నాగేశ్వరరావును రాచకొండ ఎస్ఓటీ, వనస్థలిపురం పోలీసులు ఆదివారం రాత్రి కస్టడీలోకి తీసుకున్నట్లు ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో వెల్లడిరచారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోందని, నిందితుడ్ని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం కింద నిందితుడిపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గత రెండేళ్లుగా బాధిత మహిళను లైంగికంగా వేధించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.