Monday, August 15, 2022
Monday, August 15, 2022

అపోహతో మా వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు : రేవంత్‌రెడ్డి

తాను రాజగోపాల్‌ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో వెంకట్‌ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వెంకట్‌ రెడ్డికి, తనకు మధ్య అగాథం సృష్టించేందుకు కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన రాజగోపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ కోసమే పని చేసే వెంకట్‌ రెడ్డి ఇద్దరూ వేరు అని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల అపోహతో మా వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదన్నారు. రాజగోపాల్‌ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ చర్చకు సిద్ధమని రేవంత్‌ సవాల్‌ విసిరారు. రాజగోపాల్‌ రెడ్డి కాంట్రాక్టులు, గడచిన 8 ఏళ్లలో ఆయన కేసీఆర్‌పై చేసిన పోరాటం గురించి మునుగోడులో మాట్లాడతానని కూడా రేవంత్‌ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img