Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

అప్రమత్తంగా ఉండాలి : మంత్రి జగదీష్‌రెడ్డి

గులాబ్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురిశాయి.ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితిలను సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలతో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండేలా చర్యలు తీసుకునేలా విద్యుత్‌ శాఖను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img