Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

అభివృద్ధి కనిపించడం లేదా?: మంత్రి కేటీఆర్‌

పక్క రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలకు మన అభివృద్ధి కనిపిస్తుంటే.. మన పక్కనే ఉన్న నేతలకు కనిపించడం లేదని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. పరిపాలన, సంక్షేమం, మరో వైపు అభివృద్ధి పనులతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది చెందుతుందని అన్నారు. ఈ ఏడాదికి మన పార్టీకి 20 ఏండ్లు నిండాయి. దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ 20 ఏండ్లు నిలదొక్కుకుని రెండు సార్లు అధికారంలోకి వచ్చిందంటే ఆషామాషీ కాదు అని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రజలకు తెలిపేందుకు ఈనెల 29న విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గులాబీ దండు సభకు కదిలితే ప్రతిపక్షాల గుండె అదరాలని అన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు బీజేపీ నేతల దగ్గర సమాధానం లేదు అన్నారు. కేసీఆర్‌ చేసిన అభివృద్ధి పనులకు బండి సంజయ్‌ తన పాదయాత్రలో బ్రాండ్‌ అంబాసిడర్‌ లాగా కనిపించారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంటింటికి సురక్షితమైన తాగునీరు ఇస్తున్నారా? గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేశారా? హరితహారం వంటి పథకాలు ఉన్నాయా? అని నిలదీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img