Monday, January 30, 2023
Monday, January 30, 2023

అమరుల త్యాగాలు మరువలేనివి : మంత్రి గంగుల కమలాకర్‌

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనలో ఎంతో మంది అమరులయ్యారని, వారి త్యాగాలు మరవులేనివని, వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. దీక్షా దివస్‌ సందర్భంగా మంగళవారం కరీంనగర్‌ నగరంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంత్రి గంగుల కమలాకర్‌ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ యాదగిరి సునీల్‌ రావు, జెడ్పీ చైర్మన్‌ కనుమల్ల విజయ, టీఆర్‌ఎస్‌ నాయకులు చల్ల హరి శంకర్‌, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img