Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

అమిత్‌ షాతో క్రీడల గురించే మాట్లాడా..: పుల్లెల గోపీచంద్‌

బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాని కలిశారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు అమిత్‌ షా నేడు హైదరాబాద్‌ వచ్చిన సంగతి తెలిసిందే. వీరి భేటీ అనంతరం గోపీచంద్‌ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్‌ షాతో కేవలం క్రీడల గురించే మాట్లాడానన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులకు వర్తింపజేసే పథకాల గురించి మాట్లాడానని చెప్పారు. దేశంలో క్రీడలు, పతకాలు, క్రీడాభివృద్ధికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, క్రీడా విధానాల గురించి చర్చించామని తెలిపారు. రాజకీయ అంశాలు తమ మధ్య చర్చకు రాలేదని స్పష్టం చేశారు. దీనిపై అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. భారత జాతీయ బ్యాడ్మింటన్‌ కోచ్‌, దిగ్గజ క్రీడాకారుడు గోపీచంద్‌ ను హైదరాబాద్‌ లో కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img