Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

అర కోటికి చేరిన ఆసరా పెన్షన్లు : మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల సంఖ్య అరకోటికి చేరిందని..దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పెన్షన్స్‌ ఇస్తున్న దాఖలాలు లేవని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం ఘనత అని అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంవెలికట్ట గ్రామంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్‌ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు 20 లక్షలుగా ఉన్న పెన్షన్ల సంఖ్యను తెలంగాణ వచ్చాక 40 లక్షలకు పెంచాలరని మంత్రి తెలిపారు. తాజాగా 65 సంవత్సరాల వయసు నుంచి 57 సంవత్సరాలకు ఇస్తూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం కారణంగా మరో 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. ఈ మొత్తం సంఖ్య యాభై లక్షలకు చేరిందని మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img