Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

అసదుద్దీన్‌ ఒవైసీకి జడ్‌ కేటగిరి భద్రత

కేంద్ర హోంశాఖ నిర్ణయం
ఎంఐఎం పార్టీ అధినేత,హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి సీఆర్పిఎఫ్‌ జడ్‌ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.గురువారం కాల్పుల ఘటన నేపథ్యంలో భద్రతపై సమీక్ష చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడిరచింది. తక్షణమే సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా చర్యలు చేపట్టింది.24 గంటల పాటు వ్యక్తిగత భద్రతా అధికారితో పాటు 22 మంది సీఆర్పిఎఫ్‌ సిబ్బందితో భద్రత కల్పించారు. ఆరుగురు నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ కమెండోలు, పోలీసులతో సహా 22మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. ఎస్కార్టు కారుతోపాటు దిల్లీి పోలీసులు, ఐటీబీపీ, సీఆర్పిఎఫ్‌ సిబ్బంది రక్షణగా ఉంటారు. అసదుద్దీన్‌పై దాడి కేసులో ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఐతే ఈ అటాక్‌కు ఒవైసీ ప్రసంగాలే కారణమని నిందితులు విచారణలో వెల్లడిరచినట్టు తెలుస్తోంది. ఐతే ఆ నిందితులు చెప్పినట్టుగా దాడికి ఎన్నికల ప్రచారంలో ఒవైసీ ప్రసంగాలే కారణమా..? ఇంకేదైనా కారణముందా..? అన్న అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనను లోక్‌సభలో లేవనెత్తుతానని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అంటున్నారు. ఒక ఎంపీపై దాడితో ఎలాంటి సందేశమిస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img