Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే సహించం..: మంత్రి నిరంజన్‌ రెడ్డి

వైఎస్‌ షర్మిలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే.. ఒక్కమాటకు వందమాటలు అంటాం.. ఆత్మవిశ్వాసంతో చీల్చి చెండాడుతామని తేల్చిచెప్పారు. రాజన్న బిడ్డవైతే రేపు మునుగోడులో పోటి చేసి నీ సత్తా ఏంటో చూపించాలని షర్మిలకు నిరంజన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. గోపాల్‌పేట మండల పరిధిలోని 16 గ్రామపంచాయతీలకు చెందిన 1331 మందికి నూతన ఆసరా ఫించను గుర్తింపు కార్డులను మంత్రి నిరంజన్‌ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. 22 ఏండ్లుగా తెలంగాణ జెండా పట్టుకుని ప్రజల మధ్యన ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడిన ఉద్యమకారున్ని అని తెలిపారు. రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీది అని ధ్వజమెత్తారు. వైఎస్‌ ఆదాయపు పన్ను కట్టకముందే న్యాయవాదిగా ఆదాయపు పన్ను కట్టిన వ్యక్తిని అని గుర్తు చేశారు.వనపర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు తెచ్చి ఎకరా ఎకరాకు నీళ్లు పారించిన వ్యక్తిని అని అన్నారు.తెలంగాణ గడ్డ మీద అహంకారంతో యాత్ర చేస్తూ తెలంగాణ వారిని దూషించడం సరికాదని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గం పరిధిలో ఉన్న పొలికెపాడు గ్రామవాసి గువ్వల బాలరాజు(అచ్చంపేట ఎమ్మెల్యే)ను అవహేళన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img