Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

అహింస ద్వారా గాంధీ చేసిన ఉద్యమం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపింది : మంత్రి తలసాని

అహింస ద్వారా గాంధీ చేసిన ఉద్యమం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ చిత్రాన్ని 552 స్క్రీన్స్‌లో ప్రదర్శించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల 57 వేల మంది విద్యార్థులు ఈ చిత్రాన్ని చూశారని వెల్లడిరచారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో తెలంగాణ, తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రతినిధులను సీఎస్‌ సోమేష్‌ కుమార్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రెండు వారాలపాటు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను నేటితరానికి పరిచయం చేశామన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ సినిమాను ప్రదర్శించామని.. దీనికి తెలంగాణ, తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రతినిధులు పూర్తిగా సహకరించారని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img