Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఆగయ్య ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడటం దుర్మార్గమైన చర్య

మంత్రి గంగుల కమలాకర్‌
టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికిపాల్పడటం దుర్మార్గమైన చర్య అని మంత్రి గంగుల కమలాకర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ యూపీ, గుజరాత్‌, బీహార్‌ సంస్కృతిని నమ్ముకున్నదని విమర్శించారు. తమపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఎల్లారెడ్డిపేటలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆగయ్యను ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, రవి శంకర్‌తో కలిసి మంత్రి గంగుల కమలాకర్‌ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆగయ్యపై బీజేపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏంచేశారని దాడికి యత్నించారని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img