Friday, February 3, 2023
Friday, February 3, 2023

ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ విశేష కృషి


మంత్రి సత్యవతి రాథోడ్‌

ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశేష కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. అందులో భాగంగా కార్పోరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నందుకు గిరిజన బిడ్డగా గర్వపడుతున్నా అని చెప్పారు. శిశువిహార్‌ పిల్లల కోసం ప్రత్యేకంగా నిలోఫర్‌ ఆసుపత్రిలో వార్డ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి నగరం నలువైపులా సీఎం కేసీఆర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించనున్నారని, మెడికల్‌ కాలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం కోసం కేసీఆర్‌ రూ.10 వేల కోట్లను ఖర్చు పెట్టనున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img