సంక్రాంతి సందర్భంగా ఈనెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పదిరోజుల్లో సంస్థ ఆదాయం రూ.107.31 కోట్లుగా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.పండుగ సీజన్‌లో ప్రత్యేక బస్సుల ద్వారా 55 లక్షల మంది ప్రయణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేసినట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.