డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం
లాలా పేట్ ఫ్లై ఓవర్‌పై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకి నిలిపి, అందులో నుంచి ప్రయాణికులను దించి వేశారు.ఆ తర్వాత మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్‌లో ప్రమాద సమయంలో ప్రయాణికులు 60 మంది పైగా ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా మంటలు చెలరేడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పలువురు ప్రయాణికులు ఆయన్ను అభినందించారు.