Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ఆలయంలో మేయర్‌ ప్రత్యేక పూజలు

విశాలాంధ్ర`హైదరా బాద్‌ : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని జిహెచ్‌ఎంసి మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆమెకు ఆలయ అధికారులు ప్రత్యేక స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు చేశారు. తెలంగాణ వచ్చాక తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ సీఎం అయ్యాక యాదాద్రి ఆలయ అభివృద్ధిని చూస్తేనే తెలంగాణ అభివృద్ధి గురించి అర్థం అవుతుందన్నారు. యాదాద్రి ఆలయం చాలా శక్తివంతమైన మహిమాన్విత ఆలయమన్నారు. ఏడు సంవత్సరాల కాలంలో యాదాద్రి ఆలయం లాంటి ఆలయాన్ని భారత దేశంలో ఎక్కడ నిర్మించలేదని తెలిపారు. యాదాద్రి ఆలయాన్ని దేశంలోనే అతి పెద్ద ఆలయంగా సీఎం కేసీఆర్‌ తీర్చిదిద్దుతున్నారన్నారు. భవిష్యత్‌లో లక్షల మంది దేశ విదేశాల నుండి యాదాద్రికి వచ్చే అవకాశం ఉందన్నారు. యాదాద్రి ప్రాంతం దన్యమవుతుందన్నారు. తెలంగాణ తెచ్చుకుని మహాభాగ్యాన్ని పొందామన్నారు. అద్భుతమైన ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ స్వయంగా పనులు పర్యవేక్షిస్తున్నారన్నారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img