Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

ఆ ఆరోపణల నుంచి దృష్టి మరల్చడానికే అగ్నిపథ్‌..

కేటీఆర్‌ ట్వీట్‌
శ్రీలంక పవన విద్యుత్‌ కాంట్రాక్టుల్లో మోదీ-అదానీ అవినీతి బంధంపై దేశం దృష్టిని మరల్చడానికే అగ్నిపథ్‌ స్కీమ్‌ను ప్రకటించరా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు.ఇక అగ్నిపథ్‌ స్కీమ్‌ను సమర్థిస్తున్న కేంద్ర మంత్రులపై కూడా కేటీఆర్‌ మండిపడ్డారు. అగ్నిపథ్‌ పథకం యువతకు డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, బార్బర్‌లు, వాషర్‌మెన్‌గా ఉపాధి కల్పించడంలో సహాయపడుతుందని చెప్పడాన్ని కేటీఆర్‌ తప్పుబట్టారు. అగ్నివీర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తామని మరో కేంద్ర మంత్రి చెప్పడాన్ని కూడా కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మోదీని అర్థం చేసుకోలేదని మీరు యువతను నిందిస్తున్నారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img