Monday, October 3, 2022
Monday, October 3, 2022

ఆ మూడు మెగా ప్రాజెక్టులు త్వరలోనే ప్రారంభం..

కేటీఆర్‌ ట్వీట్‌
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమవుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ నూతన సచివాలయంతో పాటు తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం, 125 ఫీట్ల అంబేద్కర్‌ విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ మరికొద్ది నెలల్లోనే ప్రారంభిస్తారని కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ మూడు మెగా ప్రాజెక్టులు కూడా నగరం నడిబొడ్డున ఏర్పాటు అవుతున్నాయి. 150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాయి. చాంబర్ల నిర్మాణం, ఇంటీరియర్‌ డిజైన్‌, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, వర్క్‌స్టేషన్‌ ఏర్పాటు, కలరింగ్‌, ఫ్లోరింగ్‌, మార్బుల్స్‌, పోర్టికోల నిర్మాణం.. ఇలా వివిధ రకాల పనులన్నీ ఏకకాలంలో చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img