Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

ఆ రెండు పార్టీల వల్లే పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలు పెరిగాయి. : మంత్రి ఎర్రబెల్లి

కాంగ్రెస్‌ పార్టీ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు చెత్త పార్టీలు. వాళ్ల వల్లే పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలు పెరిగాయని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మండిపడ్డారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లాలోని మూడు చింతలపల్లిలో పర్యటించారు. మంత్రి మాల్లారెడ్డితో కలిసి మూడు చింతలపల్లిలో రూ.15 లక్షల ఎస్‌డీఎఫ్‌ నిధులతో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి, 15 లక్షలతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం, 13.5 లక్షలతో మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలతో ప్రజలకు ఏనాడూ మేలు జరగలేదన్నారు. వాళ్లే లాభపడ్డారు. చేతగాని దద్దమ్మలు అని ఘాటుగా విమర్శించారు. వీళ్ల పాలనలో రాష్ట్రం, దేశం సర్వనాశనం అయిందన్నారు. గ్రామాల్లో కనీస వసతులు లేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ వచ్చాక గ్రామాలకు మంచి రోజులు వచ్చాయన్నారు. ప్రతి గ్రామానికి నిధులు అందే విధంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు 230 కోట్లు ఇస్తున్నది సీఎం కేసీఆర్‌ మాత్రమే అన్నారు కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రా రెడ్డి, పంచాయితీ రాజ్‌ కమిషనర్‌ శరత్‌, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img