Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడీయట్‌ ఫస్టియర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్‌లో 49 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ప్రకటించారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 4,59,242 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా..వారిలో 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. మార్కుల మెమోలను 17వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ దరఖాస్తులకు ఈ నెల 22 వరకు గడువు విధించినట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడిరచింది. రీకౌంటింగ్‌ కోసం పేపర్‌కు రూ.100 స్కాన్‌ కాపీతోపాటు రీవెరిఫికేషన్‌ కావాలనుకునే విద్యార్థులు పేపర్‌కు రూ.600 ఫీజు చెల్లించి ఈ సేవలు పొందవచ్చని ఇంటర్‌ బోర్డు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img