Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ద్వితీయ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ ఫలితాలను ప్రకటించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో జనరల్‌లో 48,816 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 47.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 1,02,236 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. వొకేషన్‌లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 65.07శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే, సెప్టెంబర్‌ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు ఇంటర్‌ బోర్డు అవకాశం కల్పించింది. మరో వైపు ఇవాళ సాయంత్రం ఇంటర్‌ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img