రేవంత్ రెడ్డి
హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కౌశిక్ రెడ్డిపై బహిష్కరణ వేటు వేసింది. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి రాజీనామాపై టీపీసీసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ, టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై కౌశిక్ రెడ్డి కోవర్ట్‌గా మారారన్నారు. కాంగ్రెస్‌లో ఇంటి దొంగలను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు.