Monday, January 30, 2023
Monday, January 30, 2023

ఈటలపై కక్షతోనే రీసర్వే : ఎమ్మెల్యే రఘనందన్‌రావు


బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్‌కు అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. ఈటల రాజేందర్‌పై వేధింపు ప్రయత్నాలు సరికాదన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో వ్యతిరేక ఫలితం రావడంతో..మళ్లీ కేసులను తిరిగి తోడటానికే ప్రభుత్వం సర్వే చేయిస్తోందని విమర్శించారు. ఈటలపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. నిష్పక్షపాతంగా జరిగే సర్వేకు సహకరిస్తామన్నారు. వేధించే ఉద్దేశంతో చేస్తే సీఎం కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img