Monday, January 30, 2023
Monday, January 30, 2023

ఈడీ ఎదుట విచారణకు హాజరైన చార్మి

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో గురువారం ఈడీ ఎదుట చార్మి హాజరయ్యారు. ఉదయం ఆమె ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయానికి వచ్చారు. పూరి జగన్నాథ్‌, చార్మి ఇద్దరూ కలిసి డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గతంలో విచారణ చేశారు.డ్రగ్స్‌ కింగ్‌ కెల్విన్‌కు చార్మికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు దొరకడంతో అప్పట్లో ఆమెను ప్రశ్నించారు. కెల్విన్‌, చార్మిల మధ్య ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ చాటింగ్‌లు ఉన్నట్లు సమాచారం.వారి మధ్య జరిగిన వాట్సాప్‌ సంభాషణపై అధికారులకు కెల్విన్‌ అన్ని విషయాలు చెప్పడంతో ఈ మేరకు విచారణకు రావాలంటూ చార్మికి నోటీసులు ఇచ్చారు. దీంతో ఆమె ఇవాళ విచారణకు హాజరయ్యారు. కాగా నిన్న పూరి జగన్నాధ్‌ను అధికారులు సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img