Friday, December 1, 2023
Friday, December 1, 2023

ఈడీ విచారణకు హాజరైన ముమైత్‌ ఖాన్‌

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ)అధికారులు పలువురు సినీ నటులను విచారిస్తున్నారు. ఈ క్రమంలో పూరిజగన్నాథ్‌, ఛార్మి , రకుల్‌ , రవితేజ, రానా, నందు, నవదీప్‌లను ఈడీ అధికారులు ఇప్పటికే విచారించారు. కెల్విన్‌తో వీరికి ఉన్న సంబంధాల పైన విచారణ జరిపారు అధికారులు. అలాగే వారి బ్యాక్‌ లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథంలో ఈడీ విచారణకు బుధవారం ఉదయం నటి ముమైత్‌ ఖాన్‌ హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ముమైత్‌ ఖాన్‌ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలన, అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీయనున్నారు. డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఏమైనా పరిచయం ఉందా? ఆయన అకౌంట్‌కు ఎప్పుడైనా భారీ మొత్తంలో నిధులు పంపించారా.? తదతర వివరాలపై ముమైత్‌ ను విచారించనున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img