Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

ఈసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ టీ పాపిరెడ్డి, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి కలిసి ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈసెట్‌ ఎగ్జామ్‌ను మొత్తం 23,667 మంది రాయగా, 22,522 మంది క్వాలిఫై అయ్యారు. మొత్తం 95.16 శాతంమంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ప్రొఫెసర్‌ టీ పాపిరెడ్డి తెలిపారు. విద్యార్థినులు 95.93 శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 94.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసెట్‌ కౌన్సెలింగ్‌ ఆగస్టు 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా తమ ప్రాథమిక వివరాలను నమోదు చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img