Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 8 వరకు దసరా సెలవులు

ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
సెప్టెంబర్‌ 25, అక్టోబర్‌ 9న ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజుల పాటు సెలవులు
అక్టోబర్‌ 10న మళ్లీ తెరుచుకోనున్న విద్యాసంస్థలు

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ఏకంగా 13 రోజుల పాటు సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 8 వరకు సెలవులు ఉంటాయి. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన సెలవులు 13 రోజులే అయినప్పటికీ 15 రోజుల పాటు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్‌ 25, అక్టోబర్‌ 9న ఆదివారాలు కావడమే దీనికి కారణం. అక్టోబర్‌ 10న విద్యా సంస్థలు పునఃప్రారంభమవుతాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సంక్రాంతికి సెలవులను తగ్గించి… బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులను పెంచిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img