: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? దమ్ముంటే చూపించాలని ప్రతిపక్షాలకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ముస్తాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. . కేసీఆర్ అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ దేశానికే దిక్సూచిగా మారుతున్నాయని అన్నారు. రూ.18 వేల కోట్లతో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించుకుంటున్నాం అని తెలిపారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. పేదలు ఉండే ప్రాంతాల్లో ఈ ఇండ్లు నిర్మిస్తున్నాం. ముస్తాబాద్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. నిలబెట్టుకుంటుంది అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో ఒక ఇంటి నిర్మాణం కోసం ముప్పుతిప్పలు పెట్టేవారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదలు ఆత్మగౌరవం బతకాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నామని అన్నారు. . కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వాన్ని కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? దమ్ముంటే చూపించాలని సవాల్ విసిరారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు.