రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఏప్రిల్ 13, 2017న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని ఇచ్చారని తెలిపారు. హామీ ఇచ్చి ఇప్పటికి నాలుగేళ్లు అయినా.. ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. ఛాలెంజ్ చేసి, చర్చల నుంచి తప్పించుకునే బదులు… కనీసం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నానని ట్వీట్ చేశారు.