విశాలాంధ్ర ` మహబూబ్‌నగర్ : ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం అక్రమంగా తొలగిం చిన ఔట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులను ఉద్యోగా లైన ఇవ్వండి లేదా జైల్లోనైనా పెట్టండి అని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు పి.సురేష్ డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ ప్రభు త్వ జనరల్ ఆసుపత్రిలో తొలగించిన ఔట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులు విస్తృత స్థాయి జనరల్ బాడీ సమా వేశం జరిగింది. భవిష్యత్ పోరాట కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లా డుతూ రాష్ట్రంలో మూడులక్షల పైచిలుకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు ఉన్న ప్రభుత్వ అసమర్థత కారణంగా సకాలంలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ రాలేదని విమర్శించారు. దీని ఫలి తంగా చదువుల పట్టాలు పట్టుకొని ఎంతో నైపుణ్యం ఉన్నా నిరుద్యోగులు సైతం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతుల్లో ఉద్యోగాల్లో ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా అనేక అవస్థలు పడుతున్నారన్నారు. అరకొర వేతనాలతో ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందోనని భయబ్రాం తులతో బతుకులు వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని అవసరానికి ఉపయోగించుకొని దాదాపు 50 వేల పైచిలుకు ఉద్యోగాల నుండి తొల గించారని మండిపడ్డారు. కరోనా లాంటి విషమ పరిస్థితుల్లో ఆరోగ్య శాఖలో పనిచేసిన స్టాఫ్ నర్సులు పదహారు వందల నలభై మందిని ఎలాంటి ముందస్తు సమా చారం లేకుండా తొలగించడం బాధాకర మని అన్నారు. స్టాఫ్ నర్సులు పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సర్కార్ అత్యంత కర్కశంగా ప్రవర్తిస్తుందని అన్నారు. మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వంపై ఔట్ సోర్సింగ్ నర్సులు మరింత ఉధృత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు ఫర్విన్ బేగం, ఎం.నందిని, సరిత, అనిత, మెహరాజ్ సుల్తానా, కే మమత, రహిళ నౌసిన్, శారద అంజలి తదితరులు పాల్గొన్నారు.