ప్రభుత్వ ఉద్యోగులు కష్టించి పనిచేసి అభివృద్ధిలో భాగం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. సెక్రటేరియట్‌లోని 122 మంంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించిన నేపధ్యంలో గురువారం తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ సీఎస్‌ను బిఆర్కె భవన్లో ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగులు సమర్థంగా, పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే అన్నిశాఖల్లోని ఉద్యోగులందరికీ ప్రమోషన్ డ్రైవ్ నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు హ్యూమన్ రీసోర్స్ ద్వారా వారికి శిక్షణ ఇస్తామని సీఎస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.