Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ఎంపీ సంతోష్‌కు అమితాబ్‌ ప్రశంసలు

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా
బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ కార్యక్రమాన్ని బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రశంసించారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌కు హాజరైన ఆయన్ను ఎంపీ సంతోష్‌ కలిశారు. ఈ సందర్భంగా ఫిల్మ్‌ సిటీలో అమితాబ్‌ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌తో పాటు సినీ నటుడు నాగార్జున కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img