Tuesday, November 29, 2022
Tuesday, November 29, 2022

ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఈసెట్‌ పరీక్ష షెడ్యూల్‌ ఖరారు

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్‌ ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఈసెట్‌ ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాయిదా పడ్డ ఈ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఈ నెల 30, 31 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షను, ఆగస్టు 1న ఈసెట్‌, ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు టీఎస్‌ పీజీఈసెట్‌ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆయా వెబ్‌సైట్‌ల నుంచి సంబంధిత అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img