Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

ఎన్టీఆర్‌ నాలుగో కుమార్తె మృతి

విశాలాంధ్ర-హైదరాబాద్‌: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామా రావు కుటుంబంలో విషాదం చోటుచేసు కుంది. ఎన్టీఆర్‌ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. ఈ ఘటన నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇటీవలే ఉమామహేశ్వరి తన చిన్న కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించారు. కొద్దిరోజుల వ్యవధిలోనే ఆమె మరణించడం గమనార్హం. ఉమామహేశ్వరి మరణ వార్త తెలిసిన వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ హుటాహుటీన ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఉమామహేశ్వరి మరణ వార్తను బంధువర్గానికి చేరవేస్తున్న ఆమె కుటుంబ సభ్యులు విదేశీ టూర్‌లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకూ తెలియజేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులంతా ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు.
‘తీగల’ సంతాపం
సైదాబాద్‌: ఉమామహేశ్వరి మృతిపై మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంతాపం తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని వారి స్వగృహంలో, కుటుంసభ్యుల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని, వారి కుటుంబ సభ్యులను కలసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నందమూరి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నందమూరి అభిమానులకు ఈ వార్త తీవ్ర విషాదంలో నింపిందనీ, ఈ ఘటన దురదృష్టకరమని తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img