Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

ఎన్నికలప్పుడే సీఎంకు ప్రజాసమస్యలు గుర్తుకొస్తాయి: ఈటల

ఎన్నికలప్పుడే సీఎంకు ప్రజాసమస్యలు గుర్తుకొస్తాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌ మాటలకు, చేతలకు పొంతన ఉండదన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ ఇచ్చే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు. దళితబంధు ఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ మోసపూరిత మాటలు ఇక చెల్లవన్నారు. ముఖ్యమంత్రికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని ఈటల రాజేందర్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img