Friday, February 3, 2023
Friday, February 3, 2023

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టుల మృతి

చత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో తెలంగాణ`చత్తీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. గ్రేహౌండ్స్‌, మావోయిస్టుల మధ్య ఈ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. తెలంగాణ-ఛత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇంకా ఎన్‌కౌంటర్‌ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.చర్ల మండలానికి 25 కి.మీ. దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీప్రాంతంలో ఈ ఉదయం ఆరు గంటల నుంచి 7.30 గంటల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. పసర్లపాడు అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ దళాలు.. కూంబింగ్‌ నిర్వహిస్తుండగా.. ఆదివారం రాత్రి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతుందని.. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడిరచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img