Friday, February 3, 2023
Friday, February 3, 2023

ఎఫ్‌సీఐ కోటా కేటాయించండి: ఎంపీ నామా

తెలంగాణ రైతులు రోడ్డుమీదపడ్డారని లోక్‌సభలో ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. రైతుల ధాన్యం సేకరణ గురించి గత అయిదు రోజుల నుంచి ఆందోళన చేపడుతున్నట్లు చెప్పారు. అత్యవసర అంశాల గురించి కేటాయించిన సమయంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇచ్చామని, రైతు బంధు ఎకరానికి 10వేలు ఇవ్వడం.. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందాయన్నారు. దీంతో ఎక్కువ శాతం పంట దిగుబడి పెరిగిందని తెలిపారు. ధాన్యం ప్రొక్యూర్మెంట్‌ కోసం కేంద్రంతో మాట్లాడామని, ఒకసారి తీసుకుంటాం, మరోసారి తీసుకోమని కేంద్రం అంటోందని ఆరోపించారు.ఎఫ్‌సీఐకి కోటా ఇవ్వడంలేదన్నారు. ధాన్యం సేకరణ గురించి ఆరు సార్లు మీటింగ్‌ జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు పలుసార్లు కేంద్రంతో చర్చలు జరిపారన్నారు. ఏడాదికి ఎంత వరిని ప్రొక్యూర్‌ చేస్తారని నామా అడిగారు. దీంట్లో కోటా కేటాయిస్తే, ఆ విషయాన్ని రైతులకు చెబుతామన్నారు. ఏడాదికి ఎంత కోటా తీసుకుంటారో చెప్పాలని కేంద్రాన్ని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img