ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యకు కుట్ర జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్`12 వేమూరి ఎన్‌క్లేవ్‌లోని ఆయన నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తి కత్తి, పిస్తోలుతో అనుమాదాస్పదంగా తిరుగుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.ఆర్మూర్‌కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్తే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సమాచారం. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో సదరు నిందితుడు కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తిని విచారిస్తున్నట్లు బంజారా హిల్స్ పోలీసులు తెలిపారు.