Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌కు రేవంత్‌ రెడ్డి కౌంటర్‌

ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్‌లో సంఫీుభావం తెలపడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రానికో విధానం ఉండకూడదని చెప్పారు. పంజాబ్‌, హర్యానాల్లో చేసినట్లు తెలంగాణ ధాన్యం సేకరించాలని కోరుతున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన వ్యక్తం చేస్తున్నారని కవిత తెలిపారు. ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ట్వీట్‌ చేశారు. . టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం లేదని సెంట్రల్‌ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘‘ఇకపై ఎఫ్‌సీఐకి బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని మీ తండ్రి కేసీఆర్‌ గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారు. మీ తండ్రి నాడు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైంది. ఈ వాస్తవాన్ని మీరు మర్చిపోయారు’’ అంటూ రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img