Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఎరువుల ధరలు తగ్గేవరకూ ఆందోళనలు : మంత్రి ఎర్రబెల్లి

కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎరువుల ధరలు తగ్గించేవరకు తమ ఆందోళన సాగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్రం వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండు చేశారు. ఎమ్మెల్సీలు వి.గంగాధర్‌ గౌడ్‌, ఎల్‌.రమణ, దండే విఠల్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ రైతులపై కక్షకట్టి పాలిస్తోందన్నారు. బీజేపీ రైతాంగ వ్యతిరేక విధానలపై కేసీఆర్‌ ఉద్యమానికి నడుంబిగించారని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరి 5 ఏళ్లయినా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌పార్టీలు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నాయని ఆక్షేపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img