సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల మండిపాటు
అధికారంలోకి వచ్చి ఏడేళ్లయినా యువతకు ఉద్యోగాలివ్వనందుకు సీఎం కసీఆర్ అవమానంతో తలదించుకోవాలని అన్ని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మంగళవారం ఆమె వరుస ట్వీట్లు చేశారు. ‘తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని విద్యార్థులను మోసం చేసినందుకు, 7 ఏండ్ల పాలనలో నోటిఫికేషన్స్ ఇవ్వనందుకు, డిగ్రీలు చదివిన వాళ్లను హమాలీ పని చేసుకునేలా, పీజీలు చదివిన వాళ్లనురోడ్ల మీద ఛాయ్ అమ్ముకునేలా చేసి ఐదు, పది చదవని వాళ్లను మంత్రులు చేసినందుకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నందుకు, నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోనందుకు కేసీఆర్‌గారు సిగ్గుపడాలి. అవమానంతో తలదించుకోవాలి. చదువుకున్న యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు’ అంటూ షర్మిల ట్వీట్లు చేశారు.