Monday, August 15, 2022
Monday, August 15, 2022

ఏపీపై నా వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు : మంత్రి కేటీఆర్‌

తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. ఏపీలో నెలకొన్న పరిస్థితులపై చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. దీంతో ఆయన తన వ్యాఖ్యలపై తిరిగి స్పందించారు. తాను నిన్న క్రెడాయ్‌ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా చేసినవని.. అవి ఆంధ్రప్రదేశ్‌లోని తన స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండొచ్చని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని, ఎవరినో బాధ పెట్టాలనో, కించపరచాలనో అలా మాట్లాడలేదని వివరించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ట్వీట్‌ చేశారు. ‘నేను ఏపీ సీఎం జగన్‌ గారిని సోదర సమానుడిగా భావిస్తున్నా. ఆయన నాయకత్వంలో ఆ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నా’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img