Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య

ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వారం క్రితం ఎంటెక్‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం మరువక ముందే మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడిని రాజస్థాన్‌ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌ నగరానికి చెందిన మేఘా కపూర్‌గా గుర్తించారు. మూడు నెలల క్రితమే ఐఐటీలో మేఘా కపూర్‌ బీటెక్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. బీటెక్‌ పూర్తయినప్పటి నుంచి సంగారెడ్డిలోని ఆధ్యా లాడ్జిలో ఒక రూమ్‌ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మేఘా కపూర్‌ మృత దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వారం వ్యవధిలో ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండోసారి. ఆగస్ట్‌ 31న ఐఐటీలో ఎంటెక్‌ చదువుతున్న రాహుల్‌ అనే విద్యార్థి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్‌లోని తన గదిలో నైలాన్‌ తాడుతో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఐఐటీలో 2019 నుంచి ఆరుగురు విద్యార్థులు సూసైడ్‌ చేసుకున్నారు. మరోవైపు, ఐఐటీ క్యాంపస్‌లో వరుస ఆత్మహత్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img