Monday, February 6, 2023
Monday, February 6, 2023

ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు కడుతున్నాం : మంత్రి కేటీఆర్‌

ఓల్డ్‌ మారేడ్‌పల్లిలో 5 ఎకరాల్లో జీహెచ్‌ఎంసీ నిర్మించిన 468 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఒక్క స్థలమే మార్కెట్‌ ధర ప్రకారం రూ. 350 కోట్ల విలువ చేస్తుందన్నారు. ఇందులో 468 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు నిర్మించామని, ఒక్కో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కోటి రూపాయల విలువ చేస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల వారు కూడా ఇలాంటి పధకాలు కావాలంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రూ. 18 వేల కోట్లతో 2 లక్షల 75 వేల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు నిర్మిస్తున్నామన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు కడుతున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img