Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

ఒమిక్రాన్‌పై ఆందోళన వద్దు : హరీశ్‌రావు

ఒమిక్రాన్‌పై ప్రజలు ఆందోళన చెందొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. రాష్ట్రంలో అన్ని వైద్య ఆరోగ్య కేంద్రాల్లో కరోన చికిత్స కోసం అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. బుధవారం గజ్వేల్‌ జిల్లా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసి, వైద్య సదుపాయాల గురించి రోగులతో మాట్లాడి ఆరాతీశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 2 కోట్ల కరోన పరీక్షల కిట్లు, కోటి హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. గజ్వేల్‌ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు బాగున్నాయన్నారు. ఐసోలేషన్‌ కోసం సిద్దిపేటలో ఆక్సిజన్‌ సౌకర్యంతో వంద పడకల ఆస్పత్రి ఉందని చెప్పారు.సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మంత్రి హరీష్‌రావుతో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img