Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

ఓ టాలెంటెడ్‌ నటిని బాడి షేమింగ్‌ చేయడం దారుణం

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌
సాయి పల్లవి గురించి బాడీ షేమింగ్‌ చేయడం తనను తీవ్రంగా బాధించిందని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై గవర్నర్‌ తెలిపారు. న్యాచురల్‌ స్టార్‌ హీరో నాని ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్‌ చిత్రం శ్యామ్‌ సింగరాయ్‌లో ే దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి అందంగా లేదు అంటూ తమిళంలో ఓ వార్త ప్రచురించారు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఆరోపణలు వెలువడ్డాయి. ఒక టాలెంటెడ్‌ నటిని బాడి షేమింగ్‌ చేయడం దారుణమంటూ పలువురు ఆ కథానాన్ని ఖండిరచారు. ఇక తాజాగా ఇదే విషయంపై తెలంగాణ గవర్నర్‌ తమిళి సై గవర్నర్‌ స్పందించారు. ఈ విషయం తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు. కోలివుడ్‌కు చెందిన ఓ ఛానల్‌?తో మాట్లాడుతూ..తాను కూడా తన రూపం పట్ల ఎప్పుడూ ట్రోలింగ్‌కు గురయ్యాయని.. అలాంటి మాటలను తాను ఎంతో దైర్యంగా ఎదుర్కోన్నట్లుగా తెలిపారు. పొట్టిగా.. ముదురు రంగుతో.. నాలాంటి జుట్టుతో పుట్టడం మన తప్పు కాదు. వీటన్నింటిలోనూ అందం ఉంది. అందుకే కాకి తన పిల్లను బంగారు పిల్లగా భావిస్తుంది. కానీ నల్లగా ఉందని వదిలిపెట్టదు కదా అన్నారు తమిళి సై. స్త్రీలు ఎక్కువగా బాడీ షేమింగ్‌కు గురవుతారు. కానీ పురుషులు అలాంటి మాటలు ఎదుర్కోలేరు. పురుషులు 50 ఏళ్ల వయసులో ఉన్నా యువకులుగా చూస్తారు.. కానీ స్త్రీలు అలా కాదు.. మహిళల ఎదుగుదలను ఆపలేని ఈ సమాజం వారిని బాధపెట్టడం ద్వారా వారి ఎదుగుదలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img